కొమ్మసింగారము లివి కొలది వెట్టగ రావు
పమ్మిన యీసొబగులు భావించరే చెలులు
చెలియ పెద్దతురుము చీకట్లు గాయగాను
యెలమి మోముకళలు యెండ గాయగా
బలిసి రాతిరియు పగలు వెనకముందై
కలయ కొక్కట మించీ కంటీరటే చెలులు
పొందుగ నీకెచన్నులు పొడవులై పెరుగగా
నందమై నెన్నడుము బయలై వుండగా
ఇందునే కొండలు మిన్ను( గిందుమీదై యొక్కచోనే
చెంది వున్న వివివో చూచితిరటే చెలులు
శ్రీవేంకటేశువీపున( జేతు లీకెవి గప్పగా
యీవల నీతనిచేతు లీకె( గప్పగా
ఆవల( గొమ్మలు( దీగె ననలు( గొనలు నల్లి
చేవ దేరీని తిలకించితిరటే చెలులూ
ముఖ్య పదాల అర్ధాలు:
కొమ్మ: స్త్రీ (ఇక్కడ అలమేలు మంగ)
సింగారములు: అందాలు, శృంగారములు, అలంకారములు
కొలది వెట్టగ రావు: కొలచుటకు శక్యము కాదు. (అపరిమితమైన అందములు అని అర్ధం)
పమ్మిన: అతిశయించు, ఆవరించు
యీ సొబగులు: ఈ సౌందర్యములు
భావించరే చెలులు: తలచుకోండి చెలులూ
పెద్దతురుము: పెద్ద జడకొప్పు
చీకట్లు కాయగాను: చీకటి కాసినంత నల్లగా
యెలమి: తృప్తివలన
మోముకళలు: మొగము నందలి కాంతులు (brightness of her face)
యెండ గాయగా: ఎండ కాసినట్టుగా
బలిసి: మిక్కిలి బలముగా
రాతిరియు పగలు వెనకముందై: వెనక భాగం రాతిరి వలె(నల్లని కొప్పు వలన), ముందు భాగం పగలు వలే (సంతోషము వలన కాంతివంతమైన ముఖం వలన)
కలయ: అంతటా
ఒక్కట: అకస్మాత్తుగా, ఏకముగా
మించీ: అతిశయించి
కంటిరటే చెలులు: చూసితిరటే చెలులూ
పొందుగ: పొద్దికగా, చక్కగా అమరినట్టి
ఈకె: స్త్రీ
చన్నులు: వక్షోజములు
పొడవులై పెరుగగా : పొడవుగా పెరుగగ
అందమైన నెన్నడుము బయలై వుండగా: యే ఆచ్చాదన లేకుండా అందమైన నడుము (A slender waist) బయటకి కనిపించుట (ఆకాశమంత నడుమన్నమాట)
ఇందునే కొండలు మిన్ను: ఈమె లోనే కొండలు, ఆకాశము (ఆకాశమంత నడుమన్నమాట)
కిందు, మీదై ఒక్కచోనే: క్రింద ఆకాశమంత నడుము, పైన కొండల వంటి స్తనములు ఒక్కచోటనే
చెందివున్న విదిగో చూచితిరటే చెలులు: చెంది ఉన్నాయి చూచితిరటే చెలులూ
శ్రీవేంకటేశువీపున: వేంకటేశ్వరుని వీపు భాగమున
చేతులు ఈకెవి: ఆవిడ చేతులు (ఈకె అంటే స్త్రీ అని ముందు చెప్పుకున్నాం)
కప్పగా: కప్పి ఉంచగా
యీవల ఈతని చేతులు: ఇటుపక్క ఈయన చేతులు (వేంకటేశ్వరునివి అన్నమాట)
ఈకె కప్పగా: ఆమెను కప్పగా (ఈ పాటికి మీకు అర్ధమై ఉంటుంది. ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకున్నారని)
ఆవల: అవతల
కొమ్మలు, తీగెలు, అనలు, కొనలు : అనలుకొనలుగా ఉండు to bloom, flourish తామరదంపలై పెరుగు, కోమలముగా పెరుగు
చేవదేరీ: బలముగా, ధైర్యముగా, నిండు హృదయముతో
అల్లి: అల్లికొనుట
తిలకించితిరటే చెలులూ: చూసితిరటే చెలులూ
భావం:
అన్నమయ్య ఈ కీర్తనలో అలమేలుమంగ విలాసాన్ని అత్యంత కమనీయంగా వర్ణించారు.
చెలికత్తెలు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. చెలి అందాలు కొలుచుటకు సాధ్యం కాకుండా ఉన్నాయి. అపరిమితమైన అందాల్లాగ. అతిశయించు ఆ అందాలను తలుచుకోండి చెలులూ!
చెలి జడకొప్పు చీకటి అంత నల్లగా, విభుని కలసిన తృప్తితో వెలిగిపోతున్న మొహం ఎండ అంత ప్రకాశవంతముగా, ముందుభాగం పగలు, వెనక భాగం రాత్రి గా ఒకేసారి అకస్మాత్తుగా రెండూ కలసి అతియయించే ఆమె అందం చూశారటే చెలులూ!
పొడవుగా పెరిగి, ఒద్దికగా అమరినట్టి చన్నులు(స్తనములు), యే ఆచ్చాదన లేకుండా అందమైన నడుము బయటకి కనిపిస్తూ, ఈమె లోనే కొండలు - ఆకాశము, క్రింద - మీద, ఉన్నట్టుగా (పైన స్తనములు కొండలు వలే, క్రింద నడుము ఆకాశము (అంటే విశాలమైన నడుము అని చెప్పాలనుకున్నారేమో) వలే ఒకేచోట ఉన్నాయన్నమాట) ఎంత ముచ్చటగా ఉన్నాయో చూశారటే చెలులూ!
శ్రీ వేంకటేశ్వరుని వీపును ఆమె చేతులు కప్పి ఉంచగా, ఆతని చేతులు ఆమె వీపును కప్పి ఉంచగా, తామరదంపలై పెరుగు ప్రేమతో (కొలనులో తామెరలు దినదినము ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంటాయో), తీగెలు అడవుల్లో అల్లుకున్నంత బలంగా ఎంత గట్టిగా ఒకరినొకరు వాటేసుకున్నారో చూసితిరటే చెలులూ! పమ్మిన యీసొబగులు భావించరే చెలులు
చెలియ పెద్దతురుము చీకట్లు గాయగాను
యెలమి మోముకళలు యెండ గాయగా
బలిసి రాతిరియు పగలు వెనకముందై
కలయ కొక్కట మించీ కంటీరటే చెలులు
పొందుగ నీకెచన్నులు పొడవులై పెరుగగా
నందమై నెన్నడుము బయలై వుండగా
ఇందునే కొండలు మిన్ను( గిందుమీదై యొక్కచోనే
చెంది వున్న వివివో చూచితిరటే చెలులు
శ్రీవేంకటేశువీపున( జేతు లీకెవి గప్పగా
యీవల నీతనిచేతు లీకె( గప్పగా
ఆవల( గొమ్మలు( దీగె ననలు( గొనలు నల్లి
చేవ దేరీని తిలకించితిరటే చెలులూ
ముఖ్య పదాల అర్ధాలు:
కొమ్మ: స్త్రీ (ఇక్కడ అలమేలు మంగ)
సింగారములు: అందాలు, శృంగారములు, అలంకారములు
కొలది వెట్టగ రావు: కొలచుటకు శక్యము కాదు. (అపరిమితమైన అందములు అని అర్ధం)
పమ్మిన: అతిశయించు, ఆవరించు
యీ సొబగులు: ఈ సౌందర్యములు
భావించరే చెలులు: తలచుకోండి చెలులూ
పెద్దతురుము: పెద్ద జడకొప్పు
చీకట్లు కాయగాను: చీకటి కాసినంత నల్లగా
యెలమి: తృప్తివలన
మోముకళలు: మొగము నందలి కాంతులు (brightness of her face)
యెండ గాయగా: ఎండ కాసినట్టుగా
బలిసి: మిక్కిలి బలముగా
రాతిరియు పగలు వెనకముందై: వెనక భాగం రాతిరి వలె(నల్లని కొప్పు వలన), ముందు భాగం పగలు వలే (సంతోషము వలన కాంతివంతమైన ముఖం వలన)
కలయ: అంతటా
ఒక్కట: అకస్మాత్తుగా, ఏకముగా
మించీ: అతిశయించి
కంటిరటే చెలులు: చూసితిరటే చెలులూ
పొందుగ: పొద్దికగా, చక్కగా అమరినట్టి
ఈకె: స్త్రీ
చన్నులు: వక్షోజములు
పొడవులై పెరుగగా : పొడవుగా పెరుగగ
అందమైన నెన్నడుము బయలై వుండగా: యే ఆచ్చాదన లేకుండా అందమైన నడుము (A slender waist) బయటకి కనిపించుట (ఆకాశమంత నడుమన్నమాట)
ఇందునే కొండలు మిన్ను: ఈమె లోనే కొండలు, ఆకాశము (ఆకాశమంత నడుమన్నమాట)
కిందు, మీదై ఒక్కచోనే: క్రింద ఆకాశమంత నడుము, పైన కొండల వంటి స్తనములు ఒక్కచోటనే
చెందివున్న విదిగో చూచితిరటే చెలులు: చెంది ఉన్నాయి చూచితిరటే చెలులూ
శ్రీవేంకటేశువీపున: వేంకటేశ్వరుని వీపు భాగమున
చేతులు ఈకెవి: ఆవిడ చేతులు (ఈకె అంటే స్త్రీ అని ముందు చెప్పుకున్నాం)
కప్పగా: కప్పి ఉంచగా
యీవల ఈతని చేతులు: ఇటుపక్క ఈయన చేతులు (వేంకటేశ్వరునివి అన్నమాట)
ఈకె కప్పగా: ఆమెను కప్పగా (ఈ పాటికి మీకు అర్ధమై ఉంటుంది. ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకున్నారని)
ఆవల: అవతల
కొమ్మలు, తీగెలు, అనలు, కొనలు : అనలుకొనలుగా ఉండు to bloom, flourish తామరదంపలై పెరుగు, కోమలముగా పెరుగు
చేవదేరీ: బలముగా, ధైర్యముగా, నిండు హృదయముతో
అల్లి: అల్లికొనుట
తిలకించితిరటే చెలులూ: చూసితిరటే చెలులూ
భావం:
అన్నమయ్య ఈ కీర్తనలో అలమేలుమంగ విలాసాన్ని అత్యంత కమనీయంగా వర్ణించారు.
చెలికత్తెలు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. చెలి అందాలు కొలుచుటకు సాధ్యం కాకుండా ఉన్నాయి. అపరిమితమైన అందాల్లాగ. అతిశయించు ఆ అందాలను తలుచుకోండి చెలులూ!
చెలి జడకొప్పు చీకటి అంత నల్లగా, విభుని కలసిన తృప్తితో వెలిగిపోతున్న మొహం ఎండ అంత ప్రకాశవంతముగా, ముందుభాగం పగలు, వెనక భాగం రాత్రి గా ఒకేసారి అకస్మాత్తుగా రెండూ కలసి అతియయించే ఆమె అందం చూశారటే చెలులూ!
పొడవుగా పెరిగి, ఒద్దికగా అమరినట్టి చన్నులు(స్తనములు), యే ఆచ్చాదన లేకుండా అందమైన నడుము బయటకి కనిపిస్తూ, ఈమె లోనే కొండలు - ఆకాశము, క్రింద - మీద, ఉన్నట్టుగా (పైన స్తనములు కొండలు వలే, క్రింద నడుము ఆకాశము (అంటే విశాలమైన నడుము అని చెప్పాలనుకున్నారేమో) వలే ఒకేచోట ఉన్నాయన్నమాట) ఎంత ముచ్చటగా ఉన్నాయో చూశారటే చెలులూ!
(మూడవ చరణం చివర కొంత నా భావుకతను కలిపాను. ఏదైనా మార్పులున్న ఎడల తెలియజేయగలరు)
ఈ కీర్తన శ్రావణ్ కుమార్ బ్లాగు నందు వినండి.
http://www.esnips.com/doc/bf21b7c4-cff6-49cd-9ebb-2a8c80fc4384/kommasimgaaramulivi_BKP
చాలా చక్కటి సమాచారమండి...ధన్యవాదాలు
ReplyDelete