మెఱుగుఁజెక్కుల అలమేలుమంగా
తరితోడిరతులను దైవారవమ్మా
చనవులు నీకిచ్చి చక్కనివదనమెత్తి
పెనగీ నాతడు నిన్ను ప్రేమతోడను
కనువిచ్చి చూడవమ్మ కందువల నవ్వవమ్మ
మనసిచ్చి ఆతనితో మాటలాడవమ్మ
పొందులు నీతో నెరపి పూచి నీపై చేతులు వేసి
చిందీ నీపై నతడు చిరు చెమట
విందులమోవియ్యవమ్మ వేడుకలు చూపవమ్మా
అందుకొని ఆకుమడిచి యాతనికీయవమ్మ
గక్కునను కాగిలించి కరుణనీపైనించి
ఇక్కువ గూడె శ్రీవేంకటేశుడు నిన్ను
వక్కణ లడుగవమ్మ వన్నెలెల్ల జూపవమ్మ
నిక్కుచు నురము మీద నిండుకొనవమ్మా
ముఖ్య పదాల అర్ధం:
మెఱుగుఁజెక్కుల: మెరెసేటి చెంపలు గల
తరితోడి: Time, occasion. సమయము అనుసరించి, సమయానుకూలముగా
రతులను: రతి క్రీడలను, సంభోగ క్రీడలను
దైవారవమ్మా: దైవారు అంటే వెలుగు, ప్రకాశించు = ప్రకాశించవమ్మా
చనవులు నీకిచ్చి: చనువు నీకు ఇచ్చి, (స్వామి తనతో నీకిష్టమొచ్చిన రీతిలో సరసమాడే అవకాశం పెత్తనం, ఆ చనువు నీకు ఇచ్చాడు అని చెప్పాలనుకుంటున్నారు)
చక్కనివదనమెత్తి: చక్కని నీ మొగమును పైకెత్తి
పెనగీ నాతడు: పెనగి+ఆతడు =To be twisted, మెలిగొను. To surround, చుట్టుకొను. To join, unite, కలయు (గట్టిగా కౌగిలించుకున్నాడు)
కనువిచ్చి చూడవమ్మ : మెల్లగా నీ కనులు విచ్చి (అంటే అంతవరకు ఆవిడ సిగ్గుతో కనులు మూసుకుని ఉన్నదని అర్ధం) చూడమ్మా
కందువలా నవ్వవమ్మ: చమత్కారముగా నవ్వవమ్మా
మనసిచ్చి ఆతనితో మాటలాడవమ్మ: మనసు పెట్టి ఆతనితో మాట్లాడమ్మా
పొందులు నీతో నెరపి: నీతో స్నేహము (పొందుకాడు అంటే స్నేహితుడు) చేసి
పూచి : పూచు అంటే అకస్మికముగా తెల్లబట్టలలో బడే నల్లచుక్కలు (spotty clothes, which shew odd marks although washed)
చిందీ నీపై: నీపైన చిందెను
చిరు చెమట: రతిక్రియలో పాల్గొనుట వలన ఆతని శరీరముపై పుట్టిన చెమట
విందులమోవియ్యవమ్మ: ఆతను అలా అలసిపోయి ఉన్నప్పుడు నీ సంతోషములు చిందే పెదవులను ఆతనికి విందుగా ఇయ్యవమ్మా
వేడుకలు చూపవమ్మా: వేడుక = కుతూహలము, సంతోషము, వినోదము; సంబరము, ఇచ్ఛ, అభిలాష = నీ సంతోషము అతనికి తెలియజేయవమ్మా
అందుకొని ఆకుమడిచి: ప్రక్కనే ఉన్న తములపు ఆకును మడిచి
యాతనికీయవమ్మ: అతని నోటికి అందించవమ్మా
గక్కునను: శీఘ్రముగా, తొందరగా, వెంటనే
కాగిలించి: కౌగిలించుకుని
కరుణనీపైనించి: నీ మీద దయ/ప్రేమ నుంచి
ఇక్కువ గూడె శ్రీవేంకటేశుడు నిన్ను: నిన్ను తన నివాస స్థానము నందు కూడెను. ఇంకోలా కూడా అర్ధం ఉంది. అది: వేంకటేశ్వరుడు నీ జీవస్థానము ( a secret part) నందు కలిసెను. ఏది సందర్భానికి తగినదో పెద్దలు నిర్ణయించాలి.
వక్కణ లడుగవమ్మ: వ్యాఖ్యానములు (comments) అడుగవమ్మా
వన్నెలెల్ల జూపవమ్మ: అందము, అలంకారము, శృంగారము లు అన్నీ చూపవమ్మా
నిక్కుచు: కులుకుచూ
నురము మీద: ఆతని వక్షస్థలము మీద
నిండుకొనవమ్మా: ఆక్రమించుకొనవమ్మా, చక్కగా కూర్చుని విరాజిల్లుమమ్మా
భావం:
అన్నమయ్య అలమేలు మంగతో చెప్తున్నారు.
ఓ మెరిసేటి చెంపలు గల అలమేలుమంగా, సమయానుకూలముగా స్వామితో రతిసుఖాలు అనుభవించి సంతోషించు.
స్వామి తనతో నీకిష్టమొచ్చిన రీతిలో సరసమాడే అవకాశం, పెత్తనం, ఆ చనువు నీకు ఇచ్చాడు. నీ పక్కనే కూర్చుని, సిగ్గుతో ముడుచుకుపోయిన నీ చక్కని మొగమును పైకెత్తి, నిన్ను గట్టిగా హత్తుకున్నాడు. నీ సిగ్గును కొంచెం పక్కన పెట్టి నీ మూసిఉంచిన కన్నులను వికశింపజేసి స్వామిని చూడవమ్మా. మరీ అలా ముడుచుకుని కూర్చోకుండా కొంచెం చమత్కారముగా నవ్వవమ్మా. స్వేచ్చగా మనసు పెట్టి అతనితో మాట్లాడు తల్లీ.
నీతో స్నేహము చేసి రతిక్రియలో పాల్గొనుట వలన ఆతని శరీరముపై పుట్టిన చెమటని నీపై నవ్వుతూ/ప్రేమతో చల్లినాడు. అలసిపోయి నీ పక్కనే పరుండి, నీపై చేతిని ఉంచాడు. ఆ చెమట చుక్కలు తెల్లని బట్టలపై నల్లని మచ్చల్లా, బంగారం వర్ణంతో మిసమిసలాడే నీ మేని పై దొర్లుతున్నాయి. అతను ఎంతో అలసిపోయి ఉన్నాడు. ఆయన తో కలయిల వల్ల నీవు పొందిన సుఖమునకు గుర్తుగా సంతోషముతో వెలగిపోతున్న నీ మొగములో ఉన్న అమృతము చిందే నీ లేత పెదవులను స్వామికి విందుగా ఇవ్వమ్మా. నీవు అతనితో పొందిన ఆనందాన్ని అతనికి తెలియజేయవమ్మా. ఆ పక్కనే పళ్ళెంలో ఉన్న తములపాకులు తీసి సున్నం, వక్కలు, జాజికాయ, జాపత్రి, సుగంధద్రవ్యాలు కలిపి చక్కటి తాంబూలాన్ని అతని నోటికి అందించవమ్మా. (చక్కటి తాంబూలం శృంగారాభిలాషని పెంచుతుందని మన పూర్వీకులు చెబుతారు. అందుకే భోజనానంతరం ఎలాగూ శరీరానికి మదం ఎక్కుతుంది, కోరికలు ఉదయిస్తాయి. ఈ తాంబూలం వల్ల మరింత ఎక్కువ శృంగారాభిలాష కలుగుతుంది. అందుకే బ్రహ్మచారులకు అంటే పెళ్ళికాని యువతీ యువకులకు తాంబూలసేవనం నిషిద్ధం).
అలా తాంబూలాన్ని అందించాలని నువ్వు కొంచెం ముందుకు జరగగానే స్వామి నిన్ను గట్టిగా తన కౌగిలిలో బంధించాడు. నీ మీద దయతో, ప్రేమతో నిన్ను తన నివాసము నందు నీతో కలసి ఉన్నాడు. నీకేమైనా విషయాల గురించి వ్యాఖ్యానాలు కావాలంటే సందేహాలుంటే అడుగు (ఆ సమయంలో ఇంకే విషయాలుంటాయి?. ఇక్కడ శృంగారానికి సంబంధించిన విషయాల గురించి స్వామి ని అడుగు అని చెప్పాలనుకున్నారేమో). నీ విలాసాన్ని, శృంగారేచ్చను అతనికి చూపించు తల్లీ. మీ శృంగార క్రీడ ముగిసిన తరువాత కులుకుతూ మా స్వామి వక్షస్థలం ఎక్కి చక్కగా కూర్చుని ప్రకాశించవమ్మా. ఈ లోకాన్ని పాలించవమ్మా.

ఈ కీర్తన ఇక్కడ వినండి.
http://annamacharya-lyrics.blogspot.com/2010/01/668merugu-jekkula-alamelumamga.html
No comments:
Post a Comment