నెలత సొబగులివి నీ సొమ్ము
కలసి మెలసి యిటు గైకొనవయ్యా
వేమరు నవ్వుల వెన్నెల గాసీ
రామ కడకు నిటు రావయ్యా
దోమటిపలుకుల తొరిగీ తేనెలు
ఆమని కాలము అవధరించవయ్యా
వలపుల చెమటల వానలు గురిసి
సొలవక యీకెను జూడవయ్యా
పెలుచు కుచంబుల పిందెలు వొడమెను
అలరిన కానుక లందుకోవయ్యా
గములై మెయి మరుకళలు దొల(కీ
తమితో కౌగిట తగులవయ్యా
జమళి శ్రీవేంకటేశ్వర సతి గూడితివి
అమరె నీకు మేలౌనయ్యా
ముఖ్య పదాల అర్ధం:
నెలత : స్త్రీ
సొబగులు: సౌందర్యము, సొగసు (Beauty, prettiness).
నీ సొమ్ము: నీ అధీన వస్తువు/ సొత్తు/ భూషణము/ ఆభరణము
కలసి మెలసి: అన్నివేళలను దగ్గరగా ఉంటూ, స్నేహం చేస్తూ
యిటు గైకొనవయ్యా: తీసుకోవయ్యా
వేమరు నవ్వుల: అనేక వేల నవ్వులు, మాటి మాటికీ నవ్వులు, తరచుగా నవ్వులు (again and again, over and over, often, constantly
వెన్నెల గాసీ: వెన్నెల కాసి (పై రెండర్ధాలు కలిపితే నవ్వుల వెన్నెల కురిపిస్తూ అని చెప్పుకోచ్చు)
రామ కడకు: రామ అంటే అందమైన స్త్రీ (అలమేలు మంగ) వద్దకు
దోమటిపలుకుల: అందమైన పలుకులు (దోమటి అంటే అన్నము అని నిఘంటువు చెప్తోంది. అన్నమయ్య ఎన్నోసార్లు దోమటి చంద్రుడు అని వేరే కీర్తనల్లో వాడారు. కానట్టి దోమటి అంటే అందమైన అని అనుకుంటున్నా)
తొరిగీ తేనెలు: తేనెలు కారు/ స్రవించు/ ప్రవహించు/ జారు/ రాలు (To flow, gush, burst, out, run)
ఆమని కాలము: వసంత కాలము (చెట్లు చిగిర్చి పూలు పూయు కాలము)
అవధరించవయ్యా: వినవయ్యా, ఆలకించవయ్యా,
వలపుల: ప్రేమతో, మోహంతో, (Love, affection)
చెమటల: వేడేక్కిన శరీరము విడుచు నీరు
వానలు గురిసి: వానలు కురిసెను
సొలవక: అలసట వల్ల కలిగే ఆయాసము లేని, నిస్త్రాణ పొందని, (no Languishment, no faintness) (చాలా యాక్టివ్ గా ఉంది అని)
యీకెను: ఈమెని, ఈ అలమేలు అంగ ను
జూడవయ్యా: చూడవయ్యా
పెలుచు: గట్టిపడిన, కఠినతను పొందిన Stiffness, Inflexibility. Brittleness
కుచంబుల పిందెలు: స్తనముల యొక్క చివరలు (కుచాగ్రములు) (The nipple. the tip of the breast)
వొడమెను: పొడమెను = పుట్టు, కలుగు (To be produced, to arise)
అలరిన : ప్రకాశించు (To shine, glitter, be splendid)
కానుక లందుకోవయ్యా: కానుకలు అందుకోవయ్యా
గములై: గుంపులై
మెయి: శరీరము (The body)
మరుకళలు: మన్మధుని యొక్క కళలు
దొల(కీ: తొణకెను, తొణకిసలాడెను
తమితో: కోరికతో, మోహం తో
కౌగిట తగులవయ్యా: కౌగిటను చేరవయ్యా
జమళి: జంట (Double, paired, coupled)
శ్రీవేంకటేశ్వర: వేంకటపతీ
సతి గూడితివి: నీ భార్యను కలసితివి (రతి క్రియలో)
అమరు: ఒప్పు, తగు, తగియుండు (To be fit or proper, be agreeable)
నీకు మేలౌనయ్యా: నీకు అంతా శుభమౌతుంది స్వామీ.
భావం:
ఈ సంకీర్తనలో అన్నమయ్య స్వామితో మాట్లాడుతున్నాడు. ఏ విధంగా అమ్మను కలవాలో సూచనలు చేస్తున్నాడు. అంత మధుర భక్తిలోకి వెళ్ళిపోయాక/లేదా ఎక్కువగా ఎవరినైనా ఇష్టపడుతూ, నిరంతరం వారినే తలుచుకుంటూ ఉంటే....వాళ్ళ మీద మనకు ఓ అధికారం వచ్చేస్తుంది. ఇక్కడ అన్నమయ్య ఆట, మాట, పాట, అన్నీ స్వామి కోసమే.. అందుకే అన్నమయ్య పాటకు వేంకటేశ్వరుడు పరవశించిపోయాడు. అన్నమయ్య ప్రతీ మాటనూ తూ.చ. తప్పకుండా పాటించి ఉంటాడు.
స్వామీ! ఈ సౌందర్యవతి అందాలు నీ సొమ్ము. వాటి మీద పూర్తి హక్కు నీకుంది. ఆమె నీ భార్య కదా! మెల్లగా ఆవిడతో స్నేహం చేసి ఆ అందాలన్నీ అందుకుని ఆనందించు.
తరచుగా నవ్వుల వెన్నెలలు కురిపిస్తూ (అంటే చల్లని నవ్వులు అన్నమాట. ఆ నవ్వుల్లో అంతరార్ధం ఆవిడ అర్ధం చేసుకోవాలి కదా!!) నీ అందాల భార్య వద్దకు రా.. వసంతకాలంలో పూలు స్రవించే తేనెల్లాంటి తీయని అందమైన మాటలు తేనెలు నీ నోట్లోంచి జాలువార్చు. నా మాట విను స్వామీ!!
మీ ఇద్దరి మోహపు కలయిక వల్ల మీ శరీరాలు బాగా వేడెక్కి, చెమటలు వానల్లా కురుస్తున్నాయి. ఇంత జరిగినా ఆమె ఇంకా అలసిపోలేదు చూడు. నీవు కలిగించిన కోరికకి ఆవిడ స్తనాలు గట్టిగా తయారయ్యాయి. ఆమె కుచాగ్రాలు బయటకు పొడుచుకొస్తున్నాయి. ఇంతటి ఆనంద సమయంలో ప్రకాశించే ఆవిడ కానుకలు అందుకో...సరేనా!!
నీ అందాల బొమ్మ శరీరంలో మన్మధుని కళలు (కోరికలకు సంబంధించిన భావాలు) గుంపులు గుంపులు గా తొణికిపోతున్నాయి. (సగం నీరు నిండిన కుండతో నడుస్తున్నప్పుడు నీళ్ళు ఎలా తొణుకుతాయో అలా ఆమె శరీరంలో కోరికలు తారాస్థాయికి చేరాయని చెప్పాలనుకున్నారేమో!!) నీవూ అంతే కోరికతో మా అమ్మవారిని కౌగిలించుకో. మీ ఇద్దరి జంట భలే కుదిరింది. శ్రీ వేంకటేశ్వరా నీవు అలమేల్మంగ తో కలిశావు. నీకు అంతా శుభము కలుగు గాక.
ఈ కీర్తన ఇక్కడ వినండి.కలసి మెలసి యిటు గైకొనవయ్యా

http://annamacharya-lyrics.blogspot.com/2008/03/446nelata-sobagulivi-ni-sommu.html