మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవె నాపాలి మించిన నిధానమా
సందడించే గోపికల జవ్వనవనములోన
కందువదిరిగే మదగజమవు
యిందుముఖి సత్యభామ హృదయపద్మములోని
గంధము మరిగినట్టి గండు తుమ్మెద
గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో
రతిముద్దు గురిసేటి రాచిలుకా
సతుల పదారువేల జంట కన్నులఁ గలువలు
కితమై పొదిమిన నా యిందు బింబమ
సరుసంగొలనిలోని వారి చన్నుఁగొండలపై
నిరతివాలిన నా నీలమేఘమా
సిరనురమున మోచి శ్రీవేంకటాద్రి మీద
గరిమ వరాలిచ్చే కల్పతరువా
ముఖ్యపదాల అర్ధం:
శృంగార రాయ: అందమైన పురుషుడు
మించిన నిధానము: అతిశయించిన నిక్షేపము, దాచుకొన్నది, పాతర, పాతిపెట్టుకొన్నది (A treasure, a hoard or fund, a treasury)
సందడించే గోపికల: గోపికల గుంపు, సమ్మర్దము
జవ్వనవనములోన: యౌవ్వనము అనే అడవిలో
కందువదిరిగే: చమత్కారముగా/నేర్పుతో తిరిగే
మదగజమవు: మదించిన యేనుగు వంటి వాడవు
యిందుముఖి: చంద్రుని వంటి మొహము కలిగినది
సత్యభామ హృదయపద్మములోని: సత్యభామ పద్మము వంటి మనస్సులో
గంధము మరిగినట్టి: వాసనను బాగా అలవాటుపడిన (Smell, odour)
గండు తుమ్మెద: నల్లని పెద్ద తుమ్మెద వంటి వాడా
గతిగూడి: ఆనందాబ్దిగతుడై
రుక్మిణికౌగిట పంజరములో: రుక్మిణిదేవి కౌగిలి అనే పంజరములో
రతిముద్దు గురిసేటి రాచిలుకా: రతి చుంబనాలను కురిపించే అందమైన రామ చిలుక వంటి వాడా
సతుల పదారువేల: పదహారువేల మంది భార్యల
జంట కన్నులఁ గలువలకు : జంట కలువల వంటి కన్నులకు
హితమై పొదిమిన నా యిందు బింబమా: ఇష్టమైన చంద్రబింబము వంటి వాడా
గొలనిలోని వారి: కొలనులో స్నానం చేస్తున్న గోపికల
చన్నుఁగొండలపై: కొండలవంటి ఎత్తైన స్తనముల పైన
నిరతివాలిన నా నీలమేఘమా: ఎల్లప్పుడూ వాలేటువంటి నీల మేఘము వంటి వాడా
సిరనురమున: లక్ష్మిని వక్షస్థలము నందు
మోచి: ఉంచి, ధరించి, మోస్తూ
శ్రీవేంకటాద్రి మీద గరిమ వరాలిచ్చే కల్పతరువా: శ్రీ వేంకటాద్రిపైన నిలచి అడిగిన వారికి లేదనకుండా పెద్ద పెద్ద వరాలిచ్చే కలతరువు వంటి వాడా....
భావం:
ఈ సంకీర్తన అన్నమయ్య తిరుకట్ల మదనగోపాల స్వామి ని నిద్రలేపడానికి పాడిన పాట. అన్నమయ్య ఒక కవిలా కేవలం ఒక్క ప్రదేశంలో కూర్చుని కీర్తనలు రాయలేదు. ఆయన దర్శించిన ప్రతీ క్షేత్రంలో కొలువై ఉన్న దేవతలపై సంకీర్తనలు అప్పటికప్పుడే ఆశువుగా పాడేవారు. గోపాంగనలతో శ్రీకృష్ణుని చేష్టలను మెచ్చుకుంటూ, నిద్రలే స్వామీ! అని పాడ్తున్నారు. ఈ పాటనే ప్రతీ రోజూ తిరుమల క్షేత్రంలో అన్నమయ్య వంశీకులు స్వామి సుప్రభాతం ఐన వెంటనే పాడతారు. వేంకటాద్రిపై ఉన్న విభుడు సాక్షాత్తూ ద్వాపర యుగంలో బాలక్రిష్ణుడే. అన్నమయ్య ఎన్నో సంకీర్తనల్లో వేంకటాద్రి బాలక్రిష్ణా అని ముద్దుగా పిలుచుకున్నారు.
ఓ శృంగార పురుషా, మదన గోపాలా! నిద్ర లే స్వామీ!. నా మదిలో దాచుకున్న నిక్షేపమా! నన్ను కాపాడే నా దైవమా! కళ్ళు తెరువు స్వామీ!
గోపికల యౌవ్వనము అనే అడవిలో స్వేచ్చగా విహరించే మదగజము వంటి వాడా! చంద్రుని వంటి అందమైన మొగము కలిగిన నీ భార్య సత్యభామ మనస్సు అనే పద్మములో గంధము (ప్రేమను) బాగా మరిగిన నల్లని పెద్ద తుమ్మెద వంటి వాడా! నిద్రనుండి మేలుకో స్వామీ!
ఈ కీర్తన ఇక్కడ వినండి.
http://annamacharya-lyrics.blogspot.com/2006/10/50melukosrungararaya.html

ఆనందపరవశుడవై రుక్మిణి కౌగిలి అనే పంజరములో రతి ముద్దులు కురిపించే రామ చిలుకా! పదహారు వేల మంది భార్యల అందమైన జంట కలువల్లాంటి కన్నులకు ఇష్టమైన చంద్ర బింబము వంటి వాడా! (కలువలు చంద్రుణ్ణి చూడగానే వికశిస్తాయి. అలాగే ఈ పదహారువేల మంది గోపికల కలువ కన్నులకు స్వామి చంద్రబింబం అన్నమాట. ఆయన్ను చూడగానే వాళ కళ్ళు వికశిస్తాయి). నిద్రనుండి మేలుకో స్వామీ!
కొలనులో స్నానం చేస్తున్న గోపికల కొండలవంటి ఎత్తైన స్తనముల పైన ఎల్లప్పుడూ వాలేటువంటి నీల మేఘము వంటి వాడా! లక్ష్మిని వక్షస్థలము నందు ఉంచుకుని శ్రీ వేంకటాద్రిపైన నిలచి అడిగిన వారికి లేదనకుండా పెద్ద పెద్ద వరాలిచ్చే కల్పతరువు వంటి వాడా....నిద్రనుండి మేలుకో స్వామీ!