//ప// ఏమి మందు గద్దె యింతులాల యీ
రామ కు తిరుపతి రాముడే మందు
//చ// వెలసెటి విరహాన వేగేటి యింతికి
చెలియలాల యేమి సేతమే
చలివేడివలపుల చవిగన్న యీపెకు
వలపించిన తనవరుడే మందు
//చ// పొదిగొన్న తమకానఁ బొరలెటి కాంతకు
చెదరక మమమేమి సేతమే
వుదుటఁ గోరికల నొనరెటి యీపెకు
మదిలోపలి తనమగడే మందు
//చ// పొల్లవోని యాస బొరలెటి మగువకు
చెల్లఁబోమన మేమి సేతమే
కొల్లగా రతి నింతిఁ గూడినాఁ డీపెకు
నల్లని శ్రీవేంకటనాథుడే మందు
ముఖ్య పదాల అర్ధం:
కద్దు: కలదు
యింతులాల: చెలులారా
రామ: స్త్రీ
తిరుపతి రాముడే: వేంకటేశ్వరుడు
చవిగన్న: రుచి తెలుసుకున్న
యీపెకు: యీకె= స్త్రీ
పొదిగొన్న= పొదిగొను: కప్పు, ఆవరించు
తమకానఁ: విరహాన
పొర్లు: పొర్లాడు (To roll over, to roll on the ground)
చెదరక: చెదరకుండా
ఉదుట గోరికల: ఉధృతి/ఎక్కువగా ఉన్న కోరికలు (Bigness, vigour)
ఒనరు: కలుగు
మదిలోపలి: హృదయములోపలి
పొల్లవోని: తగ్గని, తరగని, క్షయించని, To decrease.
యాస బొరలెటి: ఆశతో పొర్లాడే
చెల్లఁబో: తగ్గించడానికి
కొల్లగా: మిక్కిలిగా, ఎక్కువగా
రతి నింతిఁ గూడినాఁ డీపెకు: రతీదేవిని భార్యగా పొందినవాడు చెలిని ఆవహించి ఉన్నాడు (మన్మధుడు)
భావం:
లలితమైన పదాలతో అన్నమయ్య అమ్మవారి విరహవేదనని తెలియజేస్తున్నారు. అమ్మవారు వేంకటేశ్వరుని విరహం వల్ల ఒళ్ళు వేడెక్కి, పరధ్యానంగా పడుకున్నారు. చెలులు వచ్చి అమ్మవారి ఒంటి వేడిని చూసి మనం ఏ మందు ఇవ్వగలము ఈ వేడికి? అని తమలో తాము చర్చించుకుంటున్నారు.
చెలులూ! ఏ మందు కలదే మన వద్ద ఈ వేడిని తగ్గించడానికి? ఈ అందమైన యువతికి ఆ తిరుపతి రాముడే మందు.
విరహంతో వేగుతున్న ఈ పడతికి మనమేమి చేయగలమే చెలులూ! తన భర్త వెచ్చని కౌగిళ్ళ రుచిని అనుభవించిన ఈమెకు ఆ ప్రేమని ఇవ్వగల ఆమె మగడే మందు. (ఆయనొచ్చి కౌగిళ్ళలోకి తీసుకుని ప్రేమని కురిపిస్తే ఈమె విరహం తగ్గుతుందన్నమాట).
విరహం బాగా కమ్ముకుని పాన్పు మీద అటూ, ఇటూ పొర్లాడుతున్న ఈమె తమకాన్ని పోగొట్టడానికి మనమేమి సేయగలమే? పెరిగిపోతున్న కోరికలను కలిగియున్న ఈమెకు ఆమె హృదయంలో కొలువైన ఆవిడ భర్తే మందు.
భర్త వస్తాడని, ప్రేమగా చేతుల్లోకి తీసుకుంటాడని తగ్గని ఆశతో పొర్లాడే ఈ యువతికి ఆ ఆశని తగ్గించడానికి మనమేమి సేయగలమే.. ఈమె శరీరాన్ని రతీదేవి భర్త ఐన మన్మధుడు పూనాడు, అది వదిలించడానికి నల్లని వేంకటనాధుడే మందు...
ఈ కీర్తన ఇక్కడ వినండి:
http://annamacharya-lyrics.blogspot.in/2014/02/808emi-mamdu-gadde-yimtulala-yi.html