//ప// లలితలావణ్య విలాసముతోడ
నెలఁత ధన్యత గలిగె నేఁటితోడ // పల్లవి //
//చ// కుప్పలుగా మైనసలుకొన్న కస్తూరితోడ
తొప్పఁదోగేటి చెమటతోడ
అప్పుడటు శశిరేఖలైన చనుఁగవతోడ
దప్పిదేరేటి మోముఁదమ్మితోడ // లలిత //
//చ// కులుకుఁ గబరీభరము కుంతలంబులతోడ
తొలఁగఁ దోయని ప్రేమతోడ
మొలకనవ్వులు దొలఁకు ముద్దుఁజూపులతోడ
పులకలు పొడవైన పొలుపుతోడ // లలిత //
//చ// తిరువేంకటాధిపుని మన్ననతోడ
సరిలేని దివ్యవాసనలతోడ
పరికించరాని అరవిరిభావముతోడ
సిరి దొలఁ కెడి చిన్నిసిగ్గుతోడ // లలిత //
ముఖ్యపదాల అర్ధం:
లలిత: సున్నితమైన, అందమైన
లావణ్య: సౌందర్యమైన
విలాసముతోడ: ప్రకాశము తోటి
నెలఁత: స్త్రీ
మైనసలుకొన్న; మైనపు ముద్దల్లా
తొప్పఁదోగు: తోగు+తోగు = తడిసిపోవు
శశిరేఖ: చంద్ర రేఖలు
చనుఁగవ: పయోధరములు
దప్పిదేరేటి; దాహం తీరేటి
మోముఁదమ్మితోడ: కలువ వంటి ముఖము తోడ
కులుకుఁ: శృంగారముగా కదులు
కబరీభరము= కబిరీ భారము a fine head of hair = కొప్పు
కుంతలంబులతోడ: వెంట్రుకలతో
తొలఁగఁ దోయని: తీసివేయలేనంత
మొలకనవ్వులు: చిన్నపాటి నవ్వులు
పులకలు: గగురుపొడుచు A bristling, a glow, a tingling or glowing of the skin
పొడవైన పొలుపు: నిలువెల్లా సొంపు తోటి
తిరువేంకటాధిపుని: వేంకటేశ్వరిని
మన్నన: గౌరవము
సరిలేని: సాతిలేని
పరికించరాని: కన్నులచేత చూడబడని
అరవిరి: సగం విడిచిన
సిరి: సంపద
భావం:
శ్రీవేంకటేశ్వరునితో రాత్రంతా గడిపి వచ్చిన అమ్మవారి శరీరం చూసి, చెలికత్తెలు "ఇవాళ్టితో ధన్యత పొందింది ఈవిడ", అని తమలో తాము కారణలు అన్వేషిస్తూ అమ్మవారిని ఆటపట్టిస్తున్నారు.
ప. సున్నితంగా, అందంగా ప్రకాశిస్తూన్న ఈ పడతి శరీరం ఇవాళ్టితో ధన్యత పొందింది.
చ. మైనపు ముద్దల్లా - కస్తూరీ గంధం కుప్పలుగా ఆమె శరీరంపై పోతపోసినట్టుంది. (శ్రీవారు కస్తూరీ లేపనాన్ని ఆమె శరీరం మీద బాగా దట్టించారన్నమాట)
ఆమె శరీరం చెమట నీటిలో తడిసిపోయి ఉంది. (అది కౌగిళ్ళ వేడివల్ల అని కవి భావన)
ఆమె కుచకుంభాలు చంద్ర రేఖలతో నిండి ఉన్నాయి. (శ్రీవారు ఆవిడ వక్షోజాలను గట్టిగా వత్తినప్పుడు, ఆయన గోళ్లు అర్ధచంద్రాకారంలోగుచ్చుకుని, చంద్రవంకల్లా వేసవికాలపు వెన్నెలలు కురిపిస్తున్నాయని, కవి భావన. ఏమొకో చిగురుటధరముల పాటను గుర్తు తెచ్చుకోవాలిక్కడ)
ఆమె ముఖము నీటిని నింపుకున్న పద్మంలా, దాహం తీరినట్టుగా ఉంది. (శ్రీవారితో రసక్రీడలో ఆమె అనంతమైన సంతోషాన్ని పొందిందని కవి భావన)
చ. శృంగారముగా కదిలే ఆమె జడకొప్పు జుట్టులా వేలాడుతోంది. (అంటే, గదిలోకి వెళ్ళేడప్పుడు, ఆమె చక్కగా కొప్పు పెట్టుకుని వెళ్ళింది. కానీ, శ్రీవారి చేసిన శృంగార చేష్టలకి బయటకి వచ్చేడప్పడికి, కొప్పు వదులై, జుట్టు జారిపోయి వేలాడుతోందని, అర్ధం. వారిరువురి శృంగారక్రీడని వర్ణించడానికి కవి ఎన్నుకున్న ఉపమానం ఇది)
ఆమె ముఖంలో శ్రీవారిపై ప్రేమ రెట్టింపుగా ఉంది. (భర్త ఇచ్చిన సంతోషం వల్ల ఆయనపై కలిగే అనంతమైన ప్రేమ అది, అని కవి భావన)
శ్రీవారిపై సిగ్గుతో, ఆయన చేసిన పనులు గుర్తొచ్చి, ఆమె పెదవులపై నవ్వులు చిన్నగా మొలుస్తున్నట్టుంది. ఆమె చూపులు ఇంకా శ్రీవారిపై ముద్దులు కురిపిస్తున్నట్టున్నాయి. ఆమె నిలువెత్తు శరీరం ఇంకా గగురుపాటు నుండి తేరుకోకుండా మహా సొంపుగా ఉంది. (గరుర్పాటు వచ్చినప్పుడు వెంట్రుకలు నిక్కబొడుచుకోవడం చర్మం కొంచెం బిర్రుగా ఉండడం చూసి ఈ మాటలంటున్నారు)
చ. ఈమె శ్రీవేంకటేశ్వరుని కౌగిలిలో సమ్మానింపబడి, ముద్దు చేయబడింది. ఈమె దేహం నుండి వచ్చే సువాసనలకి వేరే ఏ సుగంధాలూ సాటి రావు. (అయ్యవారూ, అమ్మవార్ల చెమట కూడా కలిసిన కస్తూరి వల్ల వచ్చే వాసన అన్ని పరిమళాలకంటే గొప్పగా ఉందని కవి భావన)
ఆ ముఖంలో మనం కంటితో చూడలేని చిలిపి భావాలతో లక్ష్మీదేవి సిగ్గులని ఒలకబోస్తోంది.
ఈ లక్షణాలన్నీ కలిగిన ఈమె శరీరం ఇవాల్టితో ధన్యత పొందింది.