//ప// మూసిన ముత్యాల కేలె మొఱగులు
ఆసల చిత్తాన కేలే అలవోకలు
//చ// కందులేని మోముకేలే కస్తూరి
చిందు నీకొప్పున కేలే చేమంతులు
మందయానమున కేలే మట్టెల మోత
గందమేలే పైపై కమ్మని నీమేనికి
//చ// భారపు గుబ్బల కేలే పయ్యద నీ
బీరపు చూపుల కేలే పెడమోము
జీరల బుజాల కేలే చెమటలు నీ
గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు
//చ// ముద్దుల మాటల కేలే ముదములు నీ
యద్దపు జెక్కుల కేలే అరవిరులు
వొద్దిక మాటల కేలే వూర్పులు నీకు
నద్దమేలే తిరువేంకటాద్రీశు గూడి
ముఖ్యపదాల అర్ధం:
ఆస: ఆశ
చిత్తము: మనస్సు
అలవోక: వేడుక, లీల
కందులేని: నల్లని మచ్చలు లేని
మోము: మొగము
చిందు: కదులు
మందయానము: మందమైన నడక
మేని: శరీరము
గుబ్బలు: వక్షములు
పయ్యెద: పైట
పెడమోము: ముఖము తిప్పుకొను The face turned away
ముదము: సంతోషము
అరవిరులు: సగం నిడిచిన పువ్వులు
భావం:
ముత్యపు చిప్పలో దాగి ఉండే ముత్యాలకి మెరగులెందుకు? ఆశపడే మనస్సుకి ఇంకా చపలత్వం కూడా దేనికి? ఈ పైపై మెరుగులు నీకు అవసరంలేదమ్మా! నీవు శ్రీవేంకటేశుని అర్ధాంగివి...
పరిపూర్ణమైన నీ ముఖానికి కస్తూరీ తిలకం పెట్టి కొత్తగా అందం తేవాలా?
అటూ, ఇటూ ఊగే నీ కొప్పులో అసలు పువ్వులుంటాయా? మరి ఆ మాత్రానికి చామంతులెందుకు?
స్వామి ముందుకు వచ్చేడప్పటికి సిగ్గుతో మెల్లగా నడుస్తావు. అంత మాత్రానికి కాలికి మట్టెలు పెట్టుకోవడం దేనికి?
సహజంగా సువాసనలు వెదజల్లే నీ శరీరానికి ఆ గంధపు పూతలెందుకు?
అసలే బరువైన పయోధరాలు నీవి. పైన ఆ పైట బరువు కూడా ఎందుకు?.
స్వామివారి కళ్ళలోకి చూడలేక ఆ ముఖం తిప్పుకోవడం దేనికి?
ఆ భుజాల పైకి చీర కొంగును కప్పేస్తే చెమటలు పట్టకుండా ఉంటాయా?
గోరింటాకు పెట్టుకుని ఎర్రగా, ముద్దుగా ఉన్న ఆ పదునైన గోళ్ళకి ఇంకా అలంకారాలెందుకు?
నీ మాటలే ముద్దులొలుకుతుంటాయి. ఇంకా వాటికి నవ్వు ఎందుకు పులమడం?
నీ చెక్కిళ్ళు అద్దాల్లా నున్నగా ఉంటాయి, వాటికి ఆ పూరేకులు అదమడం ఎందుకు?
నీవు శ్రీవేంకటేశుని అర్ధాంగివి. ఆయన నీపై ఎప్పుడూ ఆశని కలిగి ఉంటాడు. నువ్వు వెళ్ళేది మన్మధునికి తండ్రి దగ్గరకి.. ఆయన కౌగిలిలో ఉంటే అసలు నీకు ఊపిరైనా ఆడుతుందా? ఈ పైపై మెరుగులు నీకెందుకమ్మా?

ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,
ReplyDeleteమహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవిచేసుకొంటున్నాము.
సాయి రామ్ సేవక బృందం,
తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*