//ప// మేడలెక్కి నిన్నుఁ జూచి - కూడేననే యాసతోడ
వాడుదేరి వుస్సురందురా - వెంకటేశ యాడనుంటివిందాఁకానురా..
//చ// పిక్కటిల్లు చన్నులపై - చొక్కపు నీవుంగరము
గక్కన నేనద్దుకొందురా - వెంకటేశ లక్కవలె ముద్రలంటెరా..
//చ// దప్పిగొంటివని నీకుఁ - గప్పురముపారమిచ్చి
ముప్పిరి నీ విరహానను - వెంకటేశ నిప్పనుచు భ్రమసితిరా..
//చ// నిండఁ బూచిన మానిపై - గండుఁగోవిల గూయగా
నిండిన నీయెలుఁగంటాను - వెంకటేశ అండకు నిన్ను రమ్మంటిరా..
//చ// వుదయచందురుఁ జూచి - అదె నీపంజని సవి
యెదురుకోనే వచ్చితిరా - వెంకటేశ బెదరి మారుమోమైతిరా..
//చ// మిన్నక కేళాకూళిలో - వున్న తమ్మివిరులు నీ
కన్నులంటాఁ జేరఁ బోఁగాను - వెంకటేశ పన్ని మరునమ్ములాయరా..
//చ// ఆనిన తుమ్మిదలు నీ - మేనికాంతిఁ బోలునని
పూనిచేతఁ బట్టఁ బోఁగాను - వెంకటేశ సూనాస్త్రుని వేగులాయరా..
//చ// కందువ మై చమరించి - గందవొడి చల్లుకొని
పొంద నిన్నుఁ దలఁచితిరా - వెంకటేశ అంది చొక్కు మందులాయరా..
//చ// బొండుమల్లెపానుపుపై - నుండి నిన్నుఁ బాడి పాడి
నిండుజాగరములుంటిరా - వెంకటేశ యెండలాయ వెన్నెలలు రా..
//చ// నిద్దిరించి నీవు నాకు - వొద్దనుండఁ గలగంటి
చద్దివేఁడి వలపాయరా - వెంకటేశ సుద్దులింకా నేమి సేసేవో..
//చ// మల్లెపూవు కొనదాకి - ఝల్ల నను బులకించి
వుల్లము నీకొప్పించితిరా -వెంకటేశ కల్లగాదు మమ్ముఁ గావరా..
//చ// జోడుగూడి నీవు నేను - నాడుకొన్న మాటలెల్లా
గోడలేని చిత్తరువులై - వెంకటేశ యాడా నామతిఁ బాయవురా..
//చ// అద్దము నీడలు చూచి - ముద్దుమోవి గంటుండఁగా
కొద్దిలేని కాఁకతోడను - వెంకటేశ పొద్దువోక తమకింతురా..
//చ// పావురమురెక్కఁ జీటి - నీవొద్దికిఁ గంటియంపి
దేవరకే మొక్కుకొందురా - వెంకటేశ నీవిందు రావలెనంటాను..
//చ// బంగారు పీఁటపైనుండి - ముంగిటికి నీవురాఁగా
తొంగిచూచి నిలుచుండగా - వెంకటేశ యెంగిలిమోవేలడిగేవు..
//చ// దంతపుఁ బావాలు మెట్టి - పంతాన నేను రాఁగాను
యింతలో బలిమిఁ బట్టేవు - వెంకటేశ అంత నీకుఁ బ్రియమైతినా..
//చ// పట్టుచీరకొంగు జారి - గుట్టుతో నేనుండఁగాను
వట్టినవ్వులేల నవ్వేవు - వెంకటేశ దిట్టవు నీయంతవారమా..
//చ// కొప్పువట్టి తీసి నీవు - చెప్పరాని సేఁత సేసి
తప్పక నేఁ జూచినంతలో- వెంకటేశ చిప్పిలేల చెమరించేవు..
//చ// బొమ్మల జంకించి నిన్ను - తమ్మిపూవున వేసితే
కమ్మియేల తిట్టుదిట్టేవు - వెంకటేశ నిమ్మపంట వేతునటరా..
//చ// నెత్తమాడేనంటా రతి - పొత్తుల పందేలు వేసి
వొత్తి నీవే వోడే వేలరా - వెంకటేశ కొత్తలైన జాణవౌదువు..
//చ// వున్నతి శ్రీ వెంకటేశ - మన్నించి కూడితివిదే
నన్ను నెంత మెచ్చు మెచ్చేవు - వెంకటేశ కన్నుల పండువలాయరా..
//చ// చిలుకలు మనలోన - కలసిన యట్టివేళ
పలుకు రతిరహస్యాలు - వెంకటేశ తలఁచినేఁ దలవూతురా..
//చ// నీకు వలచిన వలపు - లాకలొత్తె నామతిని
వాకున నేఁ జెప్పఁ జాలరా - వెంకటేశ లోకమెల్లానెరిఁగినదే..
//చ//పాయము నీకొక్కనికే - చాయగా మీఁదెత్తితిని
యీయెడఁ గై వాలకుండాను - వెంకటేశ మా యింటనే పాయకుండరా..
//చ// ముమ్మాటికి నీ బాసలే - నమ్మివున్నదాన నేను
కుమ్మరించరా నీకరుణ - వెంకటేశ చిమ్ముఁ జీఁకటెల్లఁ బాయను..
ముఖ్య పదాల అర్ధం:
కూడు: కలయు
వుస్సురు: బాధ
పిక్కటిల్లు: బాగా పెద్దవైన
గక్కన: వెంటనే
చొక్కము: స్వచ్చమైన
దప్పి: దాహము
కప్పురముపారము: కర్పూరము తో చేసిన నైవేద్యపదార్ధం/కానుక
ముప్పిరి: Three folds. మూడుపిరులు, మూడురెట్లు
గండుగోవిల: మగ కోకిల
యెలుగు: శబ్దము, అరచు
అండ: తోడు, సహాయము
వుదయచందురు: ఉదయిస్తూన్న చంద్రుడు
పంజు: దివిటీ (A pole of a palanquin)
సవి: తలచి
మారుమోము: చిన్నబుచ్చుకొను
మిన్నక: ఊరకే
కేళాకూళి: మడుగు, ఆటలాదుకునే సరస్సు A bath or well with steps
తమ్మివిరులు: వికశించిన పద్మములు
మరునమ్ము: మరుని అమ్ములు= మన్మధుని బాణలు
సూనాస్ర్తుడు: వేటగాడు
వేగులాయెరా: ఎదురుచూపులాయెరా
కందువ: ప్రదేశము
చమరించు: చెమర్చు= చెమట
గందవొడి: గంధపు పొడి
చొక్కుమందు: పరవశపు మందు Love powder; an aphrodisiac drug
చద్దివేడి: చలిజ్వరము
సుద్దులు: కొంటె పనులు, నీతులు
వుల్లము: మనస్సు
కల్ల: అబద్ధము
చిత్తరువులు: బొమ్మలు, పటాలు
కాకతోడ: వేడి, జ్వరముతో
తమకము: విరహము, మోహించు
దంతపు బావాలు: బుంగమూతి
చిప్పిలి: పైకి ఉబుకు, ఉద్గమించు To gush, flow
నెత్తము: పాచికలాట
రతిపందేలు: శృంగారపు ఆటల పందేలు
వొత్తి నేవే: నీవొక్కడవే
కొత్త జాణ: కొత్త నేర్పరిగాడు
వాకున: మాటల్లో
పాయము: యౌవ్వనము
యీయెడ: యియ్యెడ: ఇంకెక్కడికీ
పాయక ఉండరా: విడిచిపెట్టకుండా ఉండరా
బాసలు: మాటలు, ఊసులు
చిమ్ము చీకటి: కారు చీకటి, కటిక చీకటి
భావం:
అన్నమయ్య సాహిత్యంలో జానపద యాసలో సాగే అత్యంత మనోహరమైన సంకీర్తన ఇది. శ్రీవారు సమయాన్నంతా ఎక్కడో గడిపి అప్పుడే కనిపించారు నాయికకి. అంతే, ఆ నాయిక ఎంత విరహాన్ననుభవించిందో స్వామికి చెప్తోంది ఈ కీర్తనలో.
//ప// నీతో కలవాలని, నిన్ను చూడాలని ఎంతో ఆశతో మేడలూ, మిద్దెలూ ఎక్కి చూసి..నువ్వు కనబడక ఎంత వేదన అనుభవించానురా...వేంకటేశా! ఇంతవరకూ ఎక్కడున్నావురా?
//చ// బాగా పెద్దవైన నా వక్షోజాలపై స్వచ్చమైన నీ ఉంగరాన్ని నేను గభాలున అద్దేసుకుంటాను. ఈ వేంకటేశ్వరా చూశావా! లక్కతో ముద్రించినట్టు ఎలా ముద్రపడిందో..(నీ విరహవేదనలో (నాయిక) శరీరం ఎంత వేడిగా అయ్యిందో చెప్పాలనుకుంది)
//చ// చాలా అలసిపోయి వచ్చావని కర్పూరపు కానుకలు నీకిచ్చి, నీవు పక్కనే ఉండటం చేత మూడు రెట్లయిన నా ఒంటి విరహాల వల్ల ఓ వేంకటేశ్వరా! ఆ కప్పురము నిప్పుగా భ్రమ పడ్డాను. (చల్లని కర్పూరము కూడా ఆమెకు నిప్పులా ఎర్రగా కనిపించింది. అంటే, విరహంతో ఆమె కన్నులు అంత ఎర్రబడ్డాయన్నమాట)
//చ// చెట్టంతా పువ్వులైన ఓ చెట్టుమీద ఓ మగకోకిల తోడుకై కూసే అరుపు ఈ ప్రదేశం అంతా మారుమ్రోగుతోంది. శ్రీవేంకటేశ్వరా! ఈ సమయంలో నాకు నీ సహవాసము కావాలని రమ్మన్నాను.
//చ// ఉదయిస్తూన్న చంద్రుని చూసి అది నీ చేతిలోని దివిటీ గా భావించి నువ్వొచ్చేస్తున్నావని నీకు యెదురుపడదామని పరిగెత్తుకొచ్చాను..కానీ, నువ్వు కాదని తెలిసి నా మోము చిన్నబుచ్చుకున్నాను.
//చ// ఊరకే ఆటలాడే సరస్సులో ఉన్న వికశించిన పద్మాలు నీకళ్ళలా కనబడి దగ్గరకి చేరబోతే, ఓ వేంకటేశా! అవి ఆ సుకుమార పువ్వులు మన్మధుని బాణాలు గా గుచ్చుకున్నాయి.. (సున్నితమైన పూరేకులు ఆమె శరీరాన్ని తాకగానే మదనతాపం పెరిగిందని భావన)
//చ// ఆ పద్మాలపై తేనెకోసం ఆనిన తుమ్మెదలు నీ శరీరపు కాంతిలో ఉన్నాయని చేతపట్టుకుందామని ప్రయత్నించగా..ఓ వేంకటేశా! వేటగాడు వేట కోసం ఎదురుచూసినట్లైంది నా ప్రయత్నం. (అంటే, ఆ తుమ్మెదలు ఆమె చేతికి అందలేదని, వాటికోసం రాత్రంతా కన్నులు ఆర్పకుండా ప్రయత్నిస్తూనే ఉందని భావన)
//చ// చక్కటి సువాసన ద్రవ్యాలను, మంచి గంధపు పొడిని బాగా నా శరీరంపై పట్టించి నిన్ను పొందాలని, నీ స్పర్శలలో పరవశించాలని అనుకున్నాను రా.. ఓ వేంకటేశా! అవి కాస్తా ప్రేమ మందుగా మారి మరింత విరహాన్ని కలగజేశాయిరా..
//చ// చక్కటి బొండు మల్లెల మంచముపై పడుకుని నిన్ను తలచుకుంటూ నీ పాటలు పాడి, పాడి రాత్రంతా మెలకువగానే ఉన్నాను రా..ఓ వేంకటేశా! చల్లని వెన్నెలలు కూడా వేడిని కలిగించే ఎండలుగా మారాయి రా. (శ్రీవారిపై విరహం వెన్నెల చల్లదనాన్ని కూడా భగభగలాడే ఎండవేడిని కలిగించిందన్నమాట)
//చ// చలిజ్వరము వచ్చి క్షణకాలం రెప్పవాల్చాను. కలలో నీవు నా పక్కనే పడుకుని ఉన్నట్టు కలగన్నాను రా..నాకొచ్చిన చలిజ్వరము నువ్వు కనిపించగానే నీమీద ప్రేమగా మారిపోయింది రా.. ఓ వేంకటేశా! ఇంకా ఇలాంటి కొంటె పనులు ఎన్ని చేస్తావో..
//చ// ఆ మంచం మీద ఉన్నమల్లెపూవు చివరలు తాకగానే నా శరీరం ఝల్లుమని పులకించింది. నా మనసు నీకు సమర్పించాను. అబద్ధము కాదు. ఓ వేంకటేశా! మమ్ము రక్షించరా..
//చ// నువ్వు నేను కలిసి చెప్పుకున్న ఊసులన్నీ గోడపై లేని చిత్రపటాల్లా గాల్లో వేలాడుతున్నాయి. ఓ వేంకటేశా! నా మనసులోంచి ఎప్పటికీ వెళ్ళవురా..(నిన్నే ఎప్పటికీ తలుచుకుంటుంటానని భావన)
//చ// అద్దంలో నన్ను నేను చూసుకుంటున్నప్పుడు నా ముద్దులొలికే పెదవిపై ఓ గంటు కనిపించింది. అది చూడగానే నిన్న నువ్వు నాతో గడిపిన రాసకేళి గుర్తొచ్చింది. ఓ వేంకటేశా! అది కనబడగానే నా ఒంట్లో మరింత వేడి పుట్టి రాత్రి సరిగ్గా గడవక నీకోసమై ఎదురుచూస్తూ విరహంతో ఉన్నానురా...
//చ// ఓ పావురం రెక్కకి ఓ ప్రేమలేఖ కట్టి నీవద్దకు పంపి భగవంతుణ్ణి వేడుకుంటూ కూర్చున్నాను. ఓ వేంకటేశా! అది నీకు సురక్షితంగా చేరి నా వద్దకు నువ్వు రావాలని.
//చ// బంగారం పీట పైనుంచి మా ఇంటి ముందరకు వచ్చినప్పుడు నేను తలుపు చాటునుండి తొంగిచూసి నిల్చున్నప్పుడు, ఓ వేంకటేశా! నా యెంగిలిపెదవి ఎందుకు అడుగుతావు?
//చ// నేనప్పుడు బుంగమూతి పెట్టి కోపంతో వచ్చేసరికి ఒక్కసారిగా గట్టిగా కౌగిలించుకున్నావు. ఓ వేంకటేశ్వరా! నీకు నేను అంత ఇష్టమయ్యానా ఇప్పుడు? (అంత ఇష్టం ఉన్నప్పుడు ఇంతవరకూ ఎక్కడున్నావు? ఇదో దెప్పిపొడుపు మాట)
//చ// నేను కట్టుకున్న పట్టుచీర పమిటకొంగు జారిపోయి..నా గుబ్బలు బయటకు కన్పించకుండా గుట్టుగా తలుపుచాటున ఉంటే, అది చూసి ఎందుకు అలా కొంటెగా నవ్వేవు? ఓ వేంకటేశ్వరా! ఇలాంటి విషయాల్లో నీవు దిట్టవు. నీ అంత వారమా మేము?
//చ// నేనెంతో చక్కగా ముడిచి పెట్టుకున్న నా జడ కొప్పుని వదులు చేసి, దానితో చెప్పలేలన్ని పనులు చేసి, ఇక చాలు ఆపమని నేను చూసేటంతలో వెంకటేశా! ఒక్కసారిగా మీదకొచ్చి చెమటను నీ అద్దుతావే?
//చ// కోపంతో నా కనుబొమ్మలను ముడిచి నిన్ను ఓ పద్మంలో పడేస్తే అదంతా ఆక్రమించేసి నన్ను తిడతావే? ఓ వేంకటేశా! నీ కోసం ఓ పెద్ద నిమ్మపంటను వెయ్యాలా లేకపోతే!
//చ// పాచికలాడదామని అంటావు. పైగా ఆటలకి శృంగారపు పనులు పందెం గా పెడతావు. కానీ, ఎప్పుడూ నువ్వొక్కడివే ఓడిపోతావే? ఓ వేంకటేశా! ఇదోరకం నేర్పరితనమా? (ఆటల్లో ఎవరు ఓడిపోతే వాళ్ళు పందెం ప్రకారం ఆ శృంగారపు పని చెయ్యాలి కాబట్టి, ఎప్పుడూ ఈయనే ఓడిపోయి ఆమెతో ఆ శృంగారం చేష్టలు చేస్తున్నాడని కవి భావన)
//చ// ఓ ఉన్నతుడైన వేంకటేశ్వరా! నన్ను మన్నించి నాతో కలుస్తున్నావు. నన్ను నువ్వెంత మెచ్చుకుంటున్నావు. నాతో కలవడానికి నువ్వెంత కష్టపడుతున్నావు. నా కన్నులకి ఇవాళ పండగే తెలుసా!
//చ// మనలో ఉన్న రెండు చిలుకలు కలిస్తే చాలు, ఎన్నో రతిరహస్యాలని పలుకుతుంటాయి. ఓ వేంకటేశ్వరా! ఆ రహస్యాలు తలపులోకి రాగానే నేను నువ్వేం చేసినా, చెప్పినా కాదనలేను, తలాడించేస్తాను.
//చ// నీలో పుట్టిన నాపై ప్రేమ నామనసుని, బుద్ధిని బాగా ఒత్తి ప్రేరేపిస్తోంది. మాటల్లో నేను చెప్పలేనురా. ఓ వేంకటేశ్వరా! ఇది లోకంలో అందరికీ తెలుసు.
//చ// నా యౌవ్వనపు సంపదలు అన్నీ నీకొక్కనికే . ఇప్పుడిప్పుడే యౌవ్వనపు చాయలు ఎత్తుకుంటున్నాను. ఓ వేంకటేశ్వరా! ఇంకెక్కడికీ వెళ్ళక మా ఇంటి విడిచిపెట్టకుండా ఇక్కడే ఉండరా.. (యౌవ్వనాన్ని విందుగా ఇస్తాను ఎక్కడకి వెళ్ళద్దని ప్రాధేయపడుతున్నట్టు కవి భావన)
//చ// ఎప్పటికీ నీవు చెప్పిన మాటలే నమ్మిఉన్నాను నేను. నీ కరుణ నాపై కుమ్మరించరా.. ఓ వేంకటేశా! నీవు నాపక్కనుంటే కటిక చీకట్లన్నీ పోతాయి..

No comments:
Post a Comment