//ప// అంతకంతకు గాలి నణఁగునా యనలంబు
కాంత నిట్టూర్పులాఁకలి చెరిచెఁగాక
//చ// కలువలూరక నీటఁ గందునా యెందైనఁ
జెలియ కన్నీరిట్లఁజేసేఁ గాక
జలజంబుపై వేఁడి చల్లునా రవి యిట్ల
వలఁచి మదనాగ్ని వదనము నొంచెఁగాక
//చ// విరులకునుఁ దుమ్మిదలు వెరచునా యెందైన
మరుబాణముల నెరులు మలఁగెఁగాక
వరుస మంచునఁ దీగె వాడునా యెందైన
అరిది చెమటలనె దేహము నొగిలెఁ గాక
//చ// కుముదహితుఁడెందైనఁ గూడునా జక్కవల
కొమరె గుబ్బలమీఁద గూడెఁ గాక
తిమిరంబు తిమిరమునఁ దెములునా యెందైన
రమణి వేంకటవిభుని రతిమఱపుగాక
ముఖ్యపదాల అర్ధం:
అనలము: నిప్పు, అగ్ని The god of fire
కాంత నిట్టూర్పులు: స్త్రీ నిశ్వాసలు
ఆకలి చెరిచెఁగాక: ఆకలిని పోగొట్టెనట్టు
కలువలూరక నీటఁ గందునా: కలువలు+ఊరక+నీట+కందునా
యెందైనఁ: ఎక్కడైనా
జలజంబు: జలమునందు పుట్టినది (తామెర పై)
విరులకు: పువ్వులకు
దుమ్మిదలు వెరచునా: తుమ్మెదలు భయపడునా
మరుబాణముల: మన్మధ బాణముల
నెరులు: కురులు
వరుస మంచునఁ: మంచు వానలకి
దీగె వాడునా యెందైన: తీగె ఎక్కడైనా వాడుతుందా?
అరిది: అపురూపమైన, అశక్యమైన
చెమటలనె దేహము నొగిలెఁ గాక: చెమటల వానలతో దేహము ఒడిలిపోయింది
కుముదహితుఁడెందైనఁ: తెల్లకలువలకి స్నేహితుడు (చంద్రుడు) ఎక్కడైనా
గూడునా జక్కవల: చక్రవాక పక్షులతో ఎక్కడైనా కలుస్తాడా?
కొమరు: యౌవ్వనవతిఐన స్త్రీ
గుబ్బలమీఁద గూడెఁ గాక: చన్నులమీద కలిసినట్టుంది
తిమిరంబు తిమిరమునఁ దెములునా: చీకటి చీకటితో పోతుందా
రమణి: సుందరమైన స్త్రీ A beauty, a lovely woman, a grace
రతిమఱపుగాక: మన్మధక్రీడ మరపింపజేస్తుంది.
భావం: ఈ సృష్టిలో కొన్ని పదార్ధాలు కొన్నింటితో ఎల్లప్పుడూ స్నేహాన్ని కలిగి యుంటాయి. కొన్ని కొన్నింటికి ప్రాణం అయ్యుంటాయి. చెట్లకి సూర్యకాంతి, అగ్నికి గాలి, తుమ్మెదలకి పద్మాలు ఎల్లప్పుడూ స్నేహితులే...కానీ, అమ్మవారి విరహానికి ఏవైతే జరగవో అవి జరిగినట్టుగా ఉంది ట.
గాలి గట్టిగా వీస్తుంటే అగ్ని మరింత ప్రజ్వరిల్లుతుందే కానీ, మంట ఆరిపోతుందా ఎక్కడైనా? కానీ, కాంత విడిచే వెచ్చటి, బలమైన నిట్టూర్పులు ఆకలిని (కడుపులో ఉండే అగ్నిని) చల్లార్చేస్తోంది ట. (అంటే విభుని విరహంతో కాంతకి ఆకలి వెయ్యడం లేదు)
కలువపువ్వులు ఊరికే నీటిలో ఉండి ఎక్కడైనా కందిపోతాయా? కానీ, చెలియ కలువపూల వంటి కన్నులను కన్నీరు వాడిపోయేలా చేసింది. (ఇక్కడ నాయిక కళ్ళు కలువ పువ్వులైతే, ఆమె కన్నీళ్ళ వల్ల అవి నల్లగా కందిపోయాయన్న మాట. అంటే, విభుని విరహం వల్ల యే స్థాయిలో ఏడ్చిందో అర్ధం చేసుకోవచ్చు). తామెర పూలపై సూర్యుడు ఎక్కడైనా ఇంత వేడిని జల్లి ఎర్రగా మాడ్చేస్తాడా? కానీ, మన్మధుని ప్రతాపము వల్ల ఆమె తెల్లనైన ముఖము తామెరలా ఎర్రగా కందిపోయింది.
పువ్వులకి తుమ్మెదలు ఎక్కడైనా భయపడతాయా? కానీ, ఆమె పొడవాటి నల్లని తుమ్మెద రెక్కల్లాంటి కురులు మన్మధబాణాలకి బెదిరిపోయాయి ట. (అంటే, కోరికలతో వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయని భావం కావచ్చు) మంచు వర్షానికి ఎక్కడైనా తీగె వాడుతుందా? కానీ, కోరికల వల్ల పుట్టే వేడికి కురిసే చెమటల వానలకి ఆమె తీగెలాంటి దేహము ఒడిలిపోయింది.
కలువపువ్వులకి స్నేహితుడైన చంద్రుడు ఎక్కడైనా చక్రవాక పక్షులతో కలిసి ఉంటాడా? (వెన్నెలలో మాత్రమే ఈ పక్షులు ఆహారాన్ని వెతుక్కుంటాయి. వెన్నెలకి మాత్రమే ఈ పక్షులు స్నేహితులు కానీ, చంద్రుడికి కాదు) కానీ, చక్రవాక పక్షుల్లా ఉబ్బెత్తుగా ఉన్న ఈ యౌవ్వనవతి చన్నులతో చంద్రుడు కలిసి యున్నాడు. (అంటే, విభుని తలపు వల్ల ఆవిడ చన్నులు ఉబ్బి ఉన్నాయని భావం) చీకటితో చీకటి ఎప్పటికైనా ముగుస్తుందా? (వెలుగు వస్తేనే చీకటి ముగుస్తుంది) కానీ, ఈ సౌందర్యవతి-వేంకట విభుడు (రతి)కలయిక చీకటిని ఇంకా పొడిగిస్తుంది/మరపింపజేస్తుంది. (అంటే, రాత్రి చాలా దీర్ఘంగా ఉంటుంది వారిద్దరికీ)

No comments:
Post a Comment