//ప// కంటి శుక్రవారము గడియ లేడింట
అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని
//చ// సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి
కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి
తుమ్మెద మైచాయతోన నెమ్మది నుండే స్వామిని
//చ// పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి
తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై
నిచ్చెమల్లెపూవు నలె నిటుతానుండే స్వామిని
//చ// తట్టు పునుగే కూరిచి చట్టలు చీరిచినిప్పు
పట్టి కరగించి వెండి పళ్యాల నించి
దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది
బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని
ముఖ్య పదాల అర్ధం:
కంటి= చూచితిని (కనుట అంటే చూచుట)
గడియ లేడింట= తెల్లవారు ఝామున రెండు గంటల నలభైయ్యెనిమిది నిమిషాలకి (ఒక గడియ అంటే 24 ని.లు. ఏడవ గడియ అంటే రోజు మొదలు నుంచి 7x24=168 నిముషాలు. అంటే, తెల్లవారు ఝామున 2:48 ని.లు.)
అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని: అలమేల్మంగ తో కూడిన శ్రీవారిని చూశాను
సొమ్ములన్నీ కడబెట్టి: ఆభరణాలన్నీ తీసి ఓ మూలన పెట్టి
సొంపుతో గోణముగట్టి: అందముగా గోచీ కట్టి (A waist cloth or modesty piece)
కదంబము: మిశ్రమము (A mixture) కదంబపొడి kadamba-poḍi. n. Pouncet. A fragrant powder compounded of various essence
చెమ్మతోన: తడితో, Damp, moist
వేష్టువలు: వేష్టనము: చుట్టుకొనడము (Surrounding, encompassing)
పసిడి గిన్నెల నించి: బంగారు గిన్నెలలో నింపి
శిరసాదిగ: తల మొదలుగ
దిగనలది: దిట్టముగా అలది
అచ్చెరపడి చూడ: ఆశ్చర్యపడి చూడగా
కన్నులకింపై: కన్నులకు చూడడానికి ఇంపుగా
తట్టు పునుగే కూరిచి: పునుగుచట్టాన్ని కూర్చుకుని The perfume called Civet (పునుగు పిల్లి ఒక సమయంలో తన వంటిని దగ్గరలో ఉన్న చెక్కలకి గానీ, వస్తువులకి గానీ రుద్దుతుంది. ఆ సమయంలో ఆ పిల్లి నుంచి ఒక ద్రవం ఆ చట్రాలకి అంటుకుంటుంది.)
చట్టలు చీరిచి: చంపు, చట్టలుపాపు, నాశనము చేయు
నిప్పు పట్టి కరగించి: నిప్పులమీద పెట్టి కరిగించి
వెండి పళ్యాల నించి: వెండి పళ్ళేలనిండా పునుగు తైలాన్ని నింపి
దట్టముగ మేనునిండ: శరీరం నిండా గట్టముగా పట్టించి, దిద్ది
బిట్టు వేడుక: . హెచ్చు, అధికమైన సంతోషముతో Excess. A great action
మురియుచుండే: మురిసిపోతూన్న
బిత్తరి స్వామిని కంటి: ప్రకాశిస్తూ, సొగసుగా ఉండే స్వామిని చూశాను
భావం:
శుక్రవారం శ్రీవారికి అభిషేకం గొప్ప కన్నులపండుగగా జరిగే విశేషమైన సేవ. అన్నమయ్య కాలంలో తప్పక జరిగేది.ఇప్పుడు కూడా జరుగుతోంది. అది అయిపోయిన తర్వాత "నిజపాద దర్శనం" పేరుతో దర్శనానికి అనుమతిస్తారు. అన్నమయ్య శ్రీవారికి అభిషేకాలు జరుతున్నప్పుడు పక్కనే నిలబడి నలుగు పాటలు, అభిషేకం పాటలు, హారతి పాటలు పాడేవారు. అభిషేకం అయ్యాక చందన తాంబూలాది సత్కారాలు అందుకునేవారు. అలాంటి ఓ శుక్రవారం శ్రీవారి అభిషేకం జరుగుతున్నప్పుడు రాసిన పాట ఇది. అభిషేకం జరిగే విధానాన్ని కళ్ళకు కట్టినట్టు రాశారు అన్నమయ్య.
శుక్రవారం తెల్లవారు ఝామున ఏడు గడియలకి (అంటే, రెండు గంటల నలభైయ్యెనిమిది నిమిషాలకి (ఒక గడియ అంటే 24 ని.లు. ఏడవ గడియ అంటే రోజు మొదలు నుంచి (అర్ధరాత్రి పన్నెండు గంటలనుంచి) 7x24=168 నిముషాలు. అంటే, శుక్రవారం తెల్లవారు ఝామున 2:48 ని.లు.) అలమేల్మంగతో కూడిన శ్రీవేంకటేశ్వరునికి అభిషేకాన్ని కన్నులారా చూశాను.
ముందుగా శ్రీవారి విగ్రహం పై ఉన్న ఆభరణాలన్నీ తీసేసి ఒక మూలగా పెట్టారు. ఒక పట్టు గోచీని చాలా అందంగా, నేర్పరితనం తో చుట్టారు. అనేక రకాల సుగంధాలను (చందనము, కర్పూరము, కుంకుమపువ్వు) కలిపిన పొడిని (కదంబము) ఓ కప్పు, పన్నీటి నీటి లో కలిపి ఒంటిని అభిషేకించారు. బట్టలని పన్నిటి చెమ్మతో స్వామి వారి తలకి, హృదయము మీద, మొల చుట్టూ చుట్టారు. నల్లని తుమ్మెద రంగులో ప్రశాంతముగా ఉన్న స్వామిని చూశాను.
పచ్చకప్పురము బాగా మెత్తగా నూరి, బంగారు గిన్నెల నిండా నింపి భక్తిగా తెచ్చి, తల నుంచి పాదముల వరకూ బాగా అలదారు (పట్టించారు). నల్లని మేని పై మెరుస్తూన్న పచ్చకప్పురము తో - స్వామిని అందరూ ఆశ్చర్యపడి చూస్తుండగా, అందరి కన్నులకూ విందును కలిగిస్తూ తెల్లని మల్లెపూవు వలే ఉన్న స్వామిని నా కన్నులారా చూశాను.
పునుగు పిల్లి రుద్ది వదలిన చట్రాలని తెచ్చి, వాటిని శుభ్రం చేసి, ఆ చట్రాలని నిప్పులమీద కరిగించగా వచ్చిన సుగంధపు తైలాన్ని వెండి పళ్ళేలనిండా నింపి పట్టుకొచ్చి శ్రీవారి శరీరానికి బాగా దట్టముగా పట్టించి, నుదుటను తిలకముగా దిద్దినప్పుడు జరిగే ఆ వేడుకలో మురిసి, మెరసిపోతున్న స్వామిని నా కన్నులారా చూశాను.
(ఇప్పటికీ తిరుమలలో పునుగు పిల్లుల్ని తి.తి.దేవస్థానం ప్రత్యేకంగా పెంచుతోంది. శ్రీవారి సేవలలో పునుగు పిల్లి తైలానికి ప్రత్యేకత ఉంది. ఈ పునుగు తైలం తో శ్రీవారి విగ్రహానికి మర్ధన చేయడం వల్లే ఇంతకాలం ఆ సాలగ్రామ విగ్రహం చెడిపోకుండా, పగుళ్ళులేకుండా ఉంది..సాక్షాత్తూ శ్రీవారి సేవకై పుట్టిన పునుగు పిల్లి జాతి ఎంత అదృష్టం చేసుకుందో కదా! ఆ తైలం తయారీ విధానం మనకి తెలియకపోయినా, క్రింది చరణంలో అన్నమయ్య కళ్ళకి కట్టినట్టు వివరించారు)..ఈ కీర్తనని వివరిస్తున్నప్పుడు చెప్పలేనంత ఆనందాన్ని పొందాను..
ఈ కీర్తనని ఇక్కడ వినండి.
http://annamacharya-lyrics.blogspot.com.au/2006/10/19kanti-sukravaramu.html

Awesome presentation
ReplyDeleteI love it