//ప// ఎంతమోహమో నీకీఇంతిమీదను
వింతవింత వేడుకల విర్రవీగేవు
//చ// తరుణిగుబ్బలు నీకుదలగడబిళ్ళలుగా
నొరగుకున్నాడవు వుబ్బున నీవు
దొరవై పయ్యెద కొంగు దోమతెర బాగుగ
సరుగ మాటుసేసుక జాణవై వున్నాడవు
//చ// భామిని తొడలు నీకు పట్టేమంచములాగున
నాముకుని పవ్వళించేవప్పటి నీవు
గోముతోడ పట్టుచీర కుచ్చెల పరపుగాగ
కామించి యిట్టె కోడెకాడవై ఉన్నాడవు
//చ// వనిత కాగిలి నీకు వాసన చప్పరముగ-
నునికి నేసుకున్నాడ వొద్దికై నీవు
యెనసితివి శ్రీవేంకటేశ యలమేల్మంగను
అనిశము సింగరరాయడవై వున్నాడవు
ముఖ్యపదార్ధం:
ఇంతి= స్త్రీ
గుబ్బలు= కుచములు, స్తనములు
ఒరగు= పవ్వళించు, జారలపడు
వుబ్బున= సంతోషముగా
పయ్యెద= పమిట, స్త్రీల వక్షస్థలమును కప్పి ఉంచు వస్త్రము
సరుగ=పెరుగు, వర్ధిల్లు
మాటుసేసుక= దాగి ఉండుట, పొంచి ఉండుట
జాణ= నేర్పరి, తెలివైన వాడు
ఆముకొని= హెచ్చుకుని, పెద్దగా మారి
గోము=సౌకుమార్యము, సుకుమారము శ్రమయెరుగనితనము
కోడెకాడు=పడుచువాడు
చప్పరము=పల్లకీ, చట్రము, a covered seat in which a god is carried on auspicious days in temples
అనిశము= ఎల్లప్పుడును
భావం:
ఈ సంకీర్తనలో శ్రీవారు తన భార్య అందాలు చూసుకుని ఎంత విర్రవీగుతున్నాడో, ఎన్ని విధాలుగా వేడుకలు పొందుతున్నాడో అన్నమయ్య వివరిస్తున్నారు.
నీ భార్యమీద ఎంత మోహమో నీకు, ఆవిడ అందాలు చూసుకుని వింతవింత భంగిమలతో విర్రవీగుతున్నావు.
మీ ఆవిడ మెత్తని స్తనములు నీకు దూదితో చేసిన తలగడబిళ్ళలు- వాటిమీద సంతోషముగా నీ తలను ఆనించి పడుకున్నావు. ఆమె పమిట కొంగుని దోమతెరలా చేసుకుని ఆ పయ్యెద లోపల ముఖాన్ని దాచుకున్న జాణకాడవు.
ఆమె బలమైన తొడలు నీకు పట్టె మంచములుగా, వాటికి ఆనుకుని పడుకునేవు. ఆమె నున్నని పొట్టపై సుకుమారంగా దోపుకున్న అతిమెత్తని పట్టుచీర కుచ్చిళ్ళు పరుపుగా తలచి యౌవ్వనవంతుడవై కోరికతో రగులుతున్నావు.
నీ భార్య కౌగిలిని నీకు ఒక పెద్ద చట్రముగా చేసుకుని అందులో యిమిడిపోయావు. శ్రీవేంకటేశ్వరా! అలమేల్మంగను చేపట్టి ఎల్లప్పుడూ శృంగారమూర్తివై సింగరరాయ నరసింహుడవై ఉన్నావు.
(ఈ సంకీర్తన సింగరాయకొండ లక్ష్మీనారశింహుని పై రాసినది గా తోస్తూంది)

No comments:
Post a Comment